Saturday, November 23, 2024

ధ‌ర‌ల పెంపు, బెల్టు షాపుల తొలగింపుతో త‌గ్గిన మ‌ద్యం విక్ర‌యాలు : సీఎం జ‌గ‌న్‌

ధ‌ర‌ల పెంపు, బెల్టు షాపుల తొల‌గింపు, ప‌ర్మిట్ రూముల ర‌ద్దుతో మ‌ద్యం విక్ర‌యాలు త‌గ్గాయ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో మద్యం విక్రయాలపై సీఎం జగన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా తగ్గాయన్నారు. ఇందుకు ధరల పెంపు కూడా మద్యం విక్రయాల తరుగుదలకు ఓ కారణంగా నిలిచిందన్నారు. అక్ర‌మ మ‌ద్యం త‌ర‌లింపు, విక్ర‌య‌దారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. పన్ను ఎగవేసే సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement