Tuesday, November 26, 2024

బీరుకు 10, క్వార్టర్​కు 20.. తెలంగాణలో లిక్కర్​ రేట్లు పెరిగినయ్​..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరోసారి మద్యం ధరలు పెరిగాయి. మద్యం, బీర్ల ధరలను 20నుంచి 25శాతం మేర పెంచుతూ ప్రభుత్వం గురువారం స్పష్టతనిచ్చింది. ఒక్కో బీర్‌ బాటిల్‌పై రూ.10, మద్యం క్వార్టర్‌పై రూ.20, 1000 మిల్లిd లీటర్ల ఫుల్‌ బాటిల్‌పై రూ. 120వరకు బాండ్ల వారీగా పెరుగుదల వర్తింపజేస్తూ సర్కార్‌ నిర్ణయం వెలువరించింది. ఈ పెంచిన ధరలను తక్షణమే అమలు చేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో పలుమార్లు మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం 2021-23 మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత ధరల పెంపు ఇదే తొలిసారి. మద్యం, బీర్ల ధరల పెంపుపై బుధవారం అధికారులు విస్తృతంగా కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రే మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్‌ అధికారులు సీల్‌ చేసి స్టాకు వివరాలను తెలుసుకున్నారు.

తాజా పెరిగిన ధరలు ఐఎంఎఫ్‌ఎల్‌(ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌)తోపాటు విదేశీ మద్యం(ఫారిన్‌ లిక్కర్‌)లపై కూడా వర్తించనుంది. గత పాలసీలో భాగంగా 2020 మేలో మద్యం ధరలను పున:సమీక్షించిన ప్రభుత్వం అప్పట్లో 20శాతం పెంచింది. రూ.200లోపు ధర ఉన్న బ్రాండ్ల 180 ఎంఎల్‌(క్వార్టర్‌)పై రూ.20, 375ఎంఎల్‌(హాఫ్‌ బాటిల్‌)పై రూ.40, 750(ఎంఎల్‌ ఫుల్‌ బాటిల్‌)పై రూ.80 చొప్పున ధరలు పెరిగాయి. ఆ తర్వాత స్లాబ్‌లో రూ.200 ధరలకు మించిన మద్యంపై 180ఎంఎల్‌కు రూ.40, 375ఎంఎల్‌పై రూ.80, 750ఎంఎల్‌పై రూ.160 చొప్పున పెంచారు. వైన్‌ బ్రాండ్‌లపై రూ.10, రూ.20, రూ.40ల చొప్పున పెంపుదల వర్తింపజేశారు.

రాష్ట్రంలో మద్యం ధరలు తాజా పెంపుతో 20నుంచి 25శాతం మేర పెరిగాయి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మద్యం ధరల పెంపునకు బుధవారం రాత్రి సీఎం కేసీఆర్‌ క్లీయరెన్స్‌ ఇచ్చారు. డిస్టిలరీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే ఇష్యూప్రైస్‌ను పెంచడంతో ప్రభుత్వానికి పెద్దగా అదనపు ఆదాయం సమకూరదని అధికారులు అంటున్నారు. ప్రతి మూడేళ్లకోసారి నిర్ణయం జరిగే మద్యం ధరలపై ఈ ఏడాది పాలసీలో తొలిసారిగా మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే డిస్టిలరీల లైసెన్సు రుసుములను రెండింతలు చేసిన నేపథ్యంలో బీర్‌, మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం వెంటనే సానుకూలత వ్యక్తం చేసింది.


భారీగా ధరల పెరుగుదల..

మద్యం కొనుగోలు రేటుగా పిలిచే ఇష్యూ ప్రైస్‌ను పెంచడం ద్వారా బేసిక్‌ ధరలో మార్పు రానుంది. దీంతో చీప్‌ లిక్కర్‌తోపాటు మీడియం, ప్రీమియం బ్రాండ్‌ల ధరలకు రెక్కులు వచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో చౌక మద్యం ధరలను భారీగా తగ్గించగా, మిగతా రకం మద్యంపై పన్నురేటును పెంచడంతో ధరల్లో మార్పు వచ్చింది. తెలంగాణలో అన్ని రకాల మద్యం ధరలు ఇతర పొరుగు రాష్ట్రాలకంటే తక్కువగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లిd, ఏపీల్లో మద్యం ధరలు తెలంగాణ కంటే తక్కువగా ఉంది. అయితే పెెరిగిన మద్యం ధరలతో ప్రజలపై రూ.2500 కోట్ల భారం పడనుందని సమాచారం. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆర్థిక శాఖ పేర్కొంది. అదేవిధంగా ఇటీవలే ఈ ఆర్ధిక యేడాది గడచిన 3 నెలల కాలంలో రాబడిలోటుపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. రుణాలపై కేంద్రం విధించిన నియంత్రణల ఫలితంగా మూడు నెలలుగా అప్పులు కష్టంగా మారాయి. తాజా అంచనాల నేపథ్యంలో ఇప్పటి నుంచే రాబడి శాఖలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పన్ను రాబడి మార్గాలను ఆన్వేషిస్తోంది. తాజాగా డిస్టిలరీల లైసెన్సుల రుసుముల పెంపు తర్వాత మద్యం అమ్మకాలపై సుంకాల రూపంలో రాబడిని పెంచుకోవాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది.

- Advertisement -

సుంకాల విధింపుతో పెరిగిన రాబడి..

ప్రభుత్వానికి మద్యం ద్వారా వివిధ మార్గాల్లో రాబడి పెరుగుతోంది. పెంచిన పన్నులతోపాటు భారీగా పెరిగిన రుసుములు ఖజానాకు కాసులు కురిపిస్తున్నాయి. ఇప్పటికే పెంచిన డిస్టిలరీల లైసెన్సు రుసుములు, నూతన బార్లు, విదేశీ మద్యంపై పన్ను పోటువంటి నిర్ణయాలతో ఖజానాకు రాబడి పెరుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement