ఇకపై ఢిల్లి మెట్రో రైలు ప్రయాణికులు తమ కూడా సీల్ చేసిన లిక్కర్ సీసాలు తీసుకొనివెళ్ళవచ్చు. అలాగని మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం తాగకూడదు. సవరించిన మార్గదర్శకాలు ఈ మేరకు ప్రయాణికులను అనుమతిస్తాయని ఢిల్లి మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) అధికారులు తెలిపారు.
గతంలో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ రూట్లలో మాత్రమే లిక్కర్ రవాణాకు అనుమతి ఉందని, మిగిలిన రూట్లో నిషేధం ఉందని చెప్పారు. ఇదే విషయమై డీఎంఆర్‌సీ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాళ్ మాట్లాడుతూ ”మెట్రో రైలులో మద్యం తాగరాదు. ఎవరైనా ప్రయాణికులు మద్యం తాగి అనుచితంగా ప్రవర్తించిన పక్షంలో వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.