Sunday, November 10, 2024

TS | 28 నుంచి మూడ్రోజులు మద్యం బంద్‌… ఈసీ ఆదేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 28నుంచి మద్యం విక్రయాలు నిల్చిపోనున్నాయి. మూడు రోజులముందునుంచే ఎన్నికలు పూర్తయ్యేదాకా బార్లు, మద్యం దుకాణాలు, కల్లు దుకానాలు మూత పడనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు మూడు రోజులపాటు నిల్చిపోనున్నాయి. ఈ నెల 30న పోలింగ్‌ నేపథ్యంలో 28 సాయంత్రం 5గంటలనుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు మద్యం దుకాణాలు సీజ్‌ చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఇది తెలంగాణలోని మద్యం ప్రియులకు చేదువార్తే అయినప్పటికీ రాజకీయ పార్టీలు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఈ మూడు రోజులు రాష్ట్రంలో వైన్స్‌, బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ చేయనున్నారు. ఈనెల 30న పోలింగ్‌ జరనుండగా.. రెండ్రోజుల ముందే మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు లైసెన్స్‌దారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక తెలంగాణలో పోలింగ్‌ దగ్గరపడుతుండటంతో ప్రలోభాల పర్వం ఊపందుకుంది.

- Advertisement -

ఓటర్లకు పంచేందుకు భారీగా నగదు, మద్యాన్ని కొందరు అభ్యర్థులు రెడీ చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే అవి చేరాల్సిన చోటుకు చేరిపోయాయని.. ఎన్నికలకు ముందురోజు ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. గత ఎన్నికలు, ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం.. ఈసారి ముందుగానే వైన్స్‌, బార్లు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణ పోలీసులు, కేంద్ర బలగాలు, ఎకై-్సజ్‌ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైగా విలువైన మద్యం పట్టుబడింది. పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు నిఘాను పెంచారుఅక్టోబర్‌ 9నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 113.5 లీటర్ల కల్లు, 2,35,839 లీటర్ల మద్యం పట్టుబడింది. వీటి విలువ రూ. 113,94,15,142 గా తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement