అంతర్జాతీయ లయన్స్ స్వచ్ఛంద సేవాసంస్థ ద్వారా స్థానిక సమస్యలను గుర్తించి తమ శక్తియుక్తుల మేరకు బడుగు, బలహీన వర్గాల అవసరార్థులకు అమూల్యమైన సేవలు అందించడం హర్షదాయకమని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కొనియాడారు. ఈ రోజు స్థానిక హోటల్ సమావేశ హాల్‌లో జరిగిన శాతవాహన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… లయన్స్ రాజ్యాంగం, ప్రవర్తనా నియమావళి అన్ని రంగాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. కంటి చూపును అందించడంలో అనాదిగా లయన్స్ క్లబ్బులకు మంచు గుర్తింపు ఉందని, సమాజ హిత కార్యక్రమాలను గుర్తించడంలో సేవాసింహాలు ముందున్నాయని తెలిపారు. లయన్ జిల్లా కోరిక మేరకు లయన్స్ సేవా కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వ భూమిని కేటాయించడంలో కృషి చేస్తానని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
అధ్యక్షులు లయన్ డా ఎస్ మనోహరాచారి అధ్యక్షతన జరిగిన శాతావాహన లయన్స్ క్లబ్ 20వ నూతన కార్యవర్గ ప్రతిష్టాపనోత్సవాన్ని ఇన్‌స్టలేషన్ అధికారి పూర్వ జిల్లా గవర్నర్ లయన్ ముద్దసాని ప్రమోద్‍కుమార్ రెడ్డి నిర్వహించి అధ్యక్షుడిగా లయన్ యాదగిరి శేఖర్ రావు, కార్యదర్శిగా లయన్ మహేందర్, సంయుక్త కార్యదర్శిగా లయన్ ఏ లక్ష్మారెడ్డి, కోషాధికారిగా లయన్ కోట సత్యం ప్రమాణ స్వీకారం చేయగా.. కార్యవర్గ సభ్యులుగా డా ఎడవల్లి విజయేందర్ రెడ్డి, డా.బుర్ర మధుసూదన్ రెడ్డి, లయన్ కె రాజెందర్ రెడ్డి, లయన్ బి.నర్సింగరావు, లయన్ ఇనుగుర్కి రమేష్, లయన్ జగదీశ్వరాచారి, లయన్ వి నరేందర్ రెడ్డి, డా.రమణాచారి, జె సి ప్రకాశ్, యం.సత్యనారాయణ రావు, లయన్ ఏ జె అనంతరావు, మేకల అరవింద్, సిహెచ్ రాంమోహన్ రావు, తదితరులు ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులు లయన్ యాదగిరి శేఖర్ రావు మాట్లడుతూ… శాతవాహన లయన్స్ క్లబ్ ద్వారా ఆరెపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరచడంలో తమ వంతు చేయూతను ఇస్తామని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, లయన్స్ క్వెస్ట్ అమలు, పర్యావరణ పరిరక్షణ, అన్నదాన కార్యక్రమాలు, నిరుపేదలకు అవసర చేయూత, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించి జిల్లాలోనే అత్యున్నత సేవా క్లబ్‌గా నిలపడానికి కృషి చేయడంలో ప్రతి లయన్ సభ్యుడు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం వెంకట రమణారెడ్డి, ఆర్‌సి లయన్ జి లక్ష్మయ్య, జెడ్‌సి లయన్ సంపత్ కుమారి, లయన్ గట్టు రాజయ్య, లయన్ శ్రీహరి రెడ్డి, లయన్ రావికంటి కృష్ణ కిషోర్ తదితర అతిథులు పాల్గొని ప్రతిష్టాపనోత్సవ శోభను ఇనుమడింపజేశారు.