Tuesday, November 26, 2024

వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు : హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వచ్చే మూడు నాలుడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలకు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.

ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా తీరంలోని ఉత్తర కేరళ, కర్నాటక నుంచి తమిళనాడు, కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కిందిస్థాయిలో బలమైన గాలులు వీస్తాయని పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు ఈ గాలులు వీచే అవకాశముందని పేర్కొంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement