హైదరాబాద్, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా మరో వైపు అకస్మాత్తుగా కురిసే అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు , ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశ ం ఉందని పేర్కొంది.
ఈ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణశాఖ జారీ చేసింది. గంటకు 3-04- కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని, చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని అధికారులు హెచ్చరించారు.