Tuesday, November 26, 2024

ఇక తేలికపాటి జల్లులే… ఆగస్టు 2న మాత్రం ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 2న మినహాయించి ఆగస్టు 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ బులిటెన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 2న బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఆదిలాబాద్‌, కుమరం భీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 7.2 మిమీలు, సిద్ధిపేటలో 1.2, కరీంనగర్‌లో 1.4, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 2.3, ఖమ్మంలో 2.2 మి.మీల వర్షపాతం నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement