Tuesday, November 26, 2024

కంటి వెలుగుతో పేదల కళ్ల‌లో ఆనందం : మంత్రి పువ్వాడ‌

ఖ‌మ్మం : పేదల కళ్ల‌ల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని 25వ డివిజన్ మేదర బజార్ లోని బస్తి నందు ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేక మందికి కంటి అద్దాలను అందించారని, తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి పేదల కంటిలో వెలుగులు నింపారని అన్నారు. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయ‌ర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకట్, మడురి ప్రసాద్, DM &HO మాలతి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement