Friday, October 18, 2024

Lifted President Rule – ఇక జ‌మ్మూ క‌శ్మీర్‌కు సంపూర్ణ స్వేచ్ఛ!

ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తివేత
కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త స‌ర్కారు
రాష్ట్ర‌ప‌తి పాల‌న తొల‌గిస్తూ కేంద్రం గెజిట్ విడుద‌ల‌
సంత‌కం చేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము
వెంట‌నే అమ‌ల్లోకి తీసుకొస్తూ ఆదేశాలు
ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నున్న కాంగ్రెస్ కూట‌మి
గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన కూట‌మి నేత ఓమ‌ర్ అబ్దుల్లా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌శ్మీర్‌: కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. అది వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్‌సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

2018లో కుప్ప‌కూలిన స‌ర్కారు..

- Advertisement -

కాగా, జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో శాసన సభను రద్దు చేసి, ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. అది ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.

ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్ర‌స్ కూట‌మి..

రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సమయంలో అక్కడ జరిగిన పరిణామాల, భద్రతాపరమైన కారణాలవల్ల 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. దీంతో 2019 అక్టోబర్ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అది ఇప్పటి వరకు కొనసాగుతున్నది. కాగా, 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీలో ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement