Saturday, November 23, 2024

క్యూఆర్‌ కోడ్‌తో జీవిత బీమా సదుపాయం..

దేశంలోనే మొదటిసారిగా క్యూఆర్‌ కోడ్‌తో జీవిత బీమా పాలసీ తీసుకునే సదుపాయాన్ని బజాజ్‌ అలెంజ్‌ కల్పించింది. ఫోన్‌ ద్వారానే బీమా పొందేందుకు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. మొత్తం 15 సర్వీసులు ఇలా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పొందవచ్చు.

కస్టమర్లు సంస్థ బ్రాంచ్‌లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ ను స్కాన్‌ చేయడం ద్వారా స్వయంగా ఈ సేవలను పొందవచ్చు. ఇలా చేయడం వల్ల సమయం ఆదాతో పాటు, తమకు కావాల్సిన సేవలను సులభంగా ఎంచుకోవచ్చని సంస్థ ఆపరేషన్స్‌ అండ్‌ కస్టమర్‌ ఎక్స్‌పిరియన్స్‌ చీఫ్‌ రాకేష్‌ క్రిష్ణన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement