వచ్చే నెలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) లిస్టింగ్ కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రపంచ మార్కెట్, ద్రవ్యోల్బణం అంచనాల మధ్య ఈ ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, ప్రామిస్ వాల్యూ కోసం ప్రభుత్వం అన్ని అంశాలను బేరీజు వేస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల మధ్య సంప్రదింపులు జరిగాయి. ఎల్ఐసీ బోర్డు కీలక సమావేశం తర్వాత దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీఓ కోసం అప్డేట్ చేసిన డ్రాప్ట్ రెడ్ హొర్రింగ్ ప్రాస్పెక్టస్(యూడీఆర్‌హెచ్‌పీ)ని ఫైల్ చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 31.6 కోట్ల షేర్లను లేదా సంస్థలో 5 శాతం వాటాను విక్రయించి.. రూ.63,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తగ్గించిన రూ.78,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది సహాయపడుతుంది. కంపెనీ వాల్యుయేషన్‌ను తగ్గించడం, దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్లో మరిన్ని షేర్లను అందించడంపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు ఈ వారం సమావేశమవుతుంది, ఇది మొదటిసారి పెట్టుబడిదారులైన చాలా మంది పాలసీదారులకు ప్లnోట్ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. బీమా సంస్థ తన వాల్యుయేషన్‌ను 30 శాతం తగ్గించి, 7శాతం వాటాలో ముందుగా ప్రజలకు 5శాతం అందించాలని యోచిస్తోంది. ఇంతకుముందు రూ.16లక్షల కోట్లుగా ఉన్న ఐపీఓ నుంచి ఇప్పుడు దాదాపు రూ. 11 లక్షల కోట్ల విలువను ప్రభుత్వం అంచనావేస్తోంది.ఎల్ఐసీ బోర్డు త్వరలో సమావేశమై ఆర్థిక సంవత్సరం 2022 ఫలితాలను ఖరారు చేయనుంది.
వచ్చే వారం మధ్యలో సవరించిన పబ్లిక్ ఆఫర్ పత్రాన్ని ఫైల్ చేస్తుంది. మే 12 నాటికి జాబితా పూర్తవుతుంది అని ప్రభుత్వ వర్గాలు కూడా పేర్కొన్నాయి. ఎల్ఐసీ ఫలితాలు బోర్డు ఆమోదించిన తర్వాత కంపెనీ సవరించిన పత్రాలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఫైల్ చేస్తుంది. ఇష్యూ కోసం ఏప్రిల్ చివరిలో ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరం నాటికి ఐపీఓని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, స్టాక్ మార్కెట్లో అస్థిర పరిస్థితులతో ప్రణాళిక అమలు కాలేదు. మార్చి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘తొలుత ఎల్ఐసీ విషయంలో ముందు వెళ్లాలని అనుకొన్నాను. భారత అంశాలు పరిగణనలోకి తీసుకొని కొంత సమయం పరిశీలించాం. గ్లోబల్ అంశాలను పరిశీలించాల్సి వస్తే.. మళ్లి పరిగణలోకి తీసుకొంటాం. ఒక ప్రైవేట్ రంగ ప్రమోటర్ ఈ కాల్ తీసుకున్నప్పుడు, అతను దానిని కంపెనీ బోర్డుకి మాత్రమే వివరించాలి. కానీ నేను ప్రపంచం మొత్తానికి వివరించాలి.’అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి 29 మధ్య ఎల్ఐసీ ఐపీఓను ప్రారంభించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..