Saturday, November 23, 2024

ఎల్‌ఐసీ ఐపీఓ , మూడు రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌..

ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ వాటాల విక్రయానికి (ఐపీఓ) అనూహ్య స్పందన లభిస్తున్నది. వాటాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం రాత్రి 7 గంటల వరకు గడువు ఇచ్చారు. ఈలోగానే 3 రెట్ల ఎక్కు దరఖాస్తులు వచ్చాయి (ఓవర్‌ సబ్‌ స్క్రెబ్‌). నిజానికి 16.20 కోట్ల వాటాలను అమ్మకానికి పెట్టగా దాదాపు 47.24 కోట్ల వాటాల కోసం బుకింగ్‌ జరిగింది. అన్ని కేటగిరీలలోని పబ్లిక్‌ ఆఫర్‌ ఓవర్‌ సబ్‌ స్క్రైబ్‌ అయిందని ఎక్స్‌చేంజ్‌ వర్గాలు తెలియజేశాయి. పాలసీదారులైతే… తమకు కేటాయించిన వాటాలకన్నా 6.01 రెట్లు ఎక్కువ వాటాల కోసం బుక్‌ చేశారు. ఉద్యోగస్తులు 4.33 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు రెండు రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 2.90 రెట్లు ఓవర్‌ సబ్‌ స్క్రైబ్‌ చేశారు. ఒక్కొక్క వాటా ప్రైస్‌ బ్యాండ్‌ను రూ.902-949గా నిర్ధారించారు. అయితే, ఉద్యోగస్థులకు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్కొక్క వాటా మీద రూ.45 డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్లకైతే ఈ డిస్కౌంట్‌ రూ. 60 వరకు ఉన్నది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇండియన్‌ మార్కెట్లలో ఇంత భారీ సమీకరణ కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి. పేటీఎం ఐపీఓ ద్వారా రూ. 18300 కోట్లు, కోల్‌ ఇండియా ఐపీఓ ద్వారా 15,200 కోట్లు సమీకరించడం జరిగింది. అయితే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ వాటాలపై అంత ఆసక్తి కనబరిచినట్లు లేదు.

ఇందుకోసం ఎల్‌ఐసీ కేవలం 8 శాతం వాటాలను మాత్రమే కేటాయించింది. గత అక్టోబర్‌ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఫెడ్‌ రేటులు పెరగడం, డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం వంటి పరిణామాల వల్ల కరెన్సీ డిప్రిసియేషన్‌ రిస్క్‌ పెరుగుతున్నదని, ఫలితంగా ఇండియాలో తమ ఆస్తుల విలువ తరిగిపోయే ప్రమాదం ఉన్నదని వీరు భావిస్తున్నారని ప్రైమ్‌ఇన్వెస్టర్‌.ఇన్‌ సహవ్యవస్థాపకులు వియా బాలా తెలియజేశారు. నిజానికి ఎల్‌ఐసీ తన వాటాలలో ఐదు శాతం వాటాలు విక్రయించాలని తొలుత భావించింది. అయితే, మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించిన తరువాత దీనిని 3.5 కుదించారు. వాటాల విక్రయంపై ఎల్‌ఐసీ చానాళ్ల నుంచే ప్రచారం నిర్వహిస్తున్నది. పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఎల్‌ఐసీ పాలసీదారులకైతో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వాటాల విక్రయం సమాచారాన్ని ఎప్పకప్పుడు అందిస్తున్నది. భారత రిజర్వు బ్యాంక్‌, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడంతో ఎల్‌ఐసీ వాటాలకు డిమాండ్‌ పెరిగింది.ఐపీఓ కన్నా ముందే యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా రూ.5,627 కోట్లను ఎల్‌ఐసీ సమీకరించింది. దేశంలోని 245 ప్రైవేట్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీలను విలీనం చేయడం ద్వారా 1956 సెప్టెంబర్‌ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం వాటిని జాతీయం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement