భారతీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఐపీఓకి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈప్రక్రియలో భాగంగా 60మంది యాంకర్ ఇన్వెస్టర్లతో కూడిన జాబితాను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో బ్లాక్‌రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫెడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ తదితర సంస్థలు ఉన్నాయి. త్వరలోనే తుది జాబితాను సిద్ధం ప్రకటించే అవకాశం ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఎల్‌ఐసీ ఐపీఓలో షేరు ధరను నిర్ణయించనున్నారు. ఇప్పటికే ఎల్‌ఐసీ సంస్థ విలువ రూ.7లక్షల కోట్లుగా సంబంధిత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్రం, మధ్యవర్తులు ఎల్‌ఐసీకి సంబంధించి మూల్యాంకనం అంచనాలను ఇన్వెస్టర్లతో పంచుకోనుంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల వాతావరణ కారణంగా ప్రభుత్వం అనుకున్నదానికంటే ఎల్‌ఐసీకి తక్కువ విలువ నిర్ణయించిందని భావిస్తున్నామని సీనియర్ అధికారి పేర్కొన్నారు. మూల్యాంకానికి సంబంధించిన తుదినిర్ణయం త్వరలో తీసుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ కమిట్‌మెంట్ లెటర్‌లను స్వీకరించిన తర్వాత ఎంత విలువ కడతారనే అంశంపై ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన ఇన్వెస్టర్లలో మరో 25శాతం మందిని జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..