Tuesday, November 26, 2024

ఎల్‌ఐసీ ఐపీఓకి మే12వరకు గడువు.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఇష్యూ

ఎల్‌ఐసీ ఐపీఓకి మే12వరకు గడువు ఉందని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. ఎల్‌ఐసీ ఐపీఓకి సెబీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మే12వరకు ముసాయిదా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని..ఒకవేళ ఆ గడువు దాటితే మరోసారి సెబీకి ఐపీఓకి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం భావించింది. అయితే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, మార్కెట్లు ఎదుర్కొంటున్న ఒడుదొడుకులును పరిగణనలోకి తీసుకున్న కేంద్రం మదుపర్ల శ్రేయస్సుదృష్ట్యా వాయిదా పడింది. ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా రిటైల్‌ మదుపర్ల నుంచి రూ.20వేల కోట్ల వరకు సమీకరించాలనే యోచనలో కేంద్రం ఉంది. అయితే ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో మదుపర్లు పెద్దమొత్తంలో ఆసక్తి చూపరని భావించి వేచిఉండేందుకు మొగ్గు చూపినట్లు ఉన్నతాధికారి తెలిపారు.

కాగా ఎల్‌ఐసీ ఎంబెడెడ్‌ వాల్యూ రూ.5కోట్లుగా లెక్కించారు. మే12నాటికి ఐపీఓకి రాకపోతే డిసెంబర్‌ ఫలితాలతోపాటు తాజా ఎంబెడెడ్‌ వాల్యూని పేర్కొంటూ మరోసారి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఫిబ్రవరి 13న దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5శాతం వాటాకు సమానమైన రూ.31.6కోట్లుకుపైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్వీటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో రూ.63వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరగనుంది. ఎల్‌ఐసీలో 100శాతం వాటా (632.49కోట్ల షేర్లు) ఉన్న ప్రభుత్వం 5శాతం వాటాను విక్రయించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement