Friday, November 22, 2024

ఎన్‌పీఏలను మెరుగుపరచుకున్న ఎల్‌ఐసీ

న్యూఢిల్లీ : ప్రతిపాదిత ఐపీవోకి ముందు బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అసెట్‌ క్వాలిటీని మెరుగుపరచుకుంది. మార్చి 31, 2021 నాటికి స్థూల పోర్ట్‌ఫోలియో రూ.4,51,303.30లో ఎన్‌పీఏ(నాన్‌- పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌) రూ.35,129.89 కోట్లుగా ఉన్నాయని ఎల్‌ఐసీ తాజా వార్షిక రిపోర్ట్‌ పేర్కొంది. సబ్‌ స్టాండర్డ్‌ అసెట్స్‌ రూ.254.37 కోట్లుగా ఉండగా.. డట్‌ఫుల్‌ అసెట్స్‌ రూ.20,369.17 కోట్లు, లాస్‌ అసెట్స్‌ రూ.14,506.35 కోట్లుగా ఉన్నాయి. ఎన్‌పీఏలకు సంబంధించి మొత్తం రూ.34,934.97 కోట్లను కేటాయించినట్టు ఎల్‌ఐసీ పేర్కొంది.

గ్రాస్‌ ఎన్‌పీఏ 7.78 శాతంగా ఉంది. ఇదే సమయంలో నికర ఎన్‌పీఏ 0.05 శాతంగా ఉందని కంపెనీ వివరించింది. డెట్‌ పోర్ట్‌ఫోలియో గ్రాస్‌ ఎన్‌పీఏ కన్నా కనిష్ఠంగా 8.17 శాతంగా ఉంది. గతేడాది నికర ఎన్‌పీఏ 0.79 శాతంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఎల్‌ఐసీ సాధారణంగా డెట్‌ బుక్‌లో ప్రొవిజన్లను కేటాయిస్తూనే ఉంటుంది. రూ.34,934.97 కోట్ల డట్‌ఫుల్‌, సబ్‌- స్టాండర్డ్‌, లాస్‌ అసెట్స్‌కు సంబంధించి రూ.37,341.6 కోట్ల ప్రొవిజన్లను కేటాయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement