ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తీపికబురు అందించింది. ఆర్థిక, ఇతర కారణాలతో ప్రీమియం చెల్లించుకోలేక నిలిచిపోయిన పాలసీల పునరుద్ధరణకు అవకాశం కల్పించింది. ల్యాప్స్ పాలసీలు మళ్లిd తెరుచుకునేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022 మధ్య కాలంలో అర్హత కలిగి ఉన్న పాలసీదారులు తిరిగి నిలిచిపోయిన పాలసీని తిరిగి పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. పాలసీ ప్రీమియం కాలంలో పాలసీలను మధ్యలోనే నిలిపివేసిన పాలసీదారులకు ఎల్‌ఐసీ ఈ అవకాశం ఇస్తున్నది. కరోనా మహమ్మారి కారణంగా ఎల్‌ఐసీ చేసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
పాలసీల పునరుద్ధరణ, జీవిత వర్తింపును పునరుద్ధరించడానికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఓ మంచి అవకాశంగా అభివర్ణించింది. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ బీమా పథకాల పాలసీదారులు ఆలస్య రుసుముతో రాయితీ పొందొచ్చు అని తెలిపింది. ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదు ఏళ్లలోపు ఉన్న కొన్నఇ అర్హత కలిగిన పాలసీలను పునరుద్ధరించేందుకు నిర్ణయించినట్టు వివరించింది. అంతేకాకుండా.. ఆలస్య రుసుములో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..