Tuesday, November 26, 2024

త‌యారీ ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతోంది.. పెర‌గ‌నున్న లెక్స‌స్ కార్ల ధ‌ర‌లు

ప్ర‌ముఖ‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ త‌మ సంస్థ కార్ల ధ‌ర‌లను పెంచే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పెరుగుతున్న ఉత్ప‌త్తి ఖర్చులతో పాటు.. రూపాయి విలువ పడిపోవడం వంటి ప్రభావాల కార‌ణంగా కంపెనీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. కాగా, లెక్సెస్ కార్ల ధ‌ర‌లు వచ్చే నెల నుండి పెర‌గ‌నున్నట్టు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. “ఇన్‌పుట్ ధర పెరుగుతోంది, కరెన్సీ మారకపు రేట్ల కారణంగా ఒత్తిడి కూడా ఉంది” అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు.

ఈ నెలాఖరులో ధరల పెంపును సంబంధించి కంపెనీ చర్చలు ప్రారంభిస్తుందని, నవంబర్ నుండి పెంపుదల అమలులోకి వస్తుందని కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ పేర్కొన్నారు. లెక్సెస్ కార్ల తయారీ సంస్థ దేశంలో ఆరు మోడళ్లను విక్రయిస్తోంది.. వీటి ధర రూ.62 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉంది.

ఇక వీటితో పాటు భారతీయ మార్కెట్ లో ఏడవ మోడల్ — Lexus LM– ను కూడా తీసుకొస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పండుగల సీజన్‌పై న‌వీన్ సోనీ మాట్లాడుతూ, డిమాండ్ బలంగానే ఉందని, కొత్త మోడల్ LM బుకింగ్‌లు ఇప్పటికే 150 యూనిట్లకు చేరుకున్నాయని చెప్పారు. అయితే ఈ మోడల్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement