బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మకు ఢిల్లి పోలీసులు గట్టి భద్రత కల్పిం చారు. హత్య బెదిరింపుల నేపథ్యంలో, శర్మకు ఆమె కుటుంబ సభ్యుల కూ భద్రతను కల్పించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. తనకు పలురకాలుగా హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని మే 28న సైబర్ సెల్‌కు నుపుర్ శర్మ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ట్విట్టర్‌తో పాటు పలు సోషల్ మీడియాల నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలిపారని వెల్లడించారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడిం చారు. పది రోజుల క్రితం టీవీ డిబేట్‌లో పాల్గొన్న నుపుర్ శర్మ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమెను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. మహాదేవ్‌ను కించపరచడం వల్లనే ఆవిధంగా మాట్లాడానన్నారు.
టీవీ డిబేట్లకు బీజేపీ కొత్త రూల్స్..
భారతీయ జనతా పార్టీ తరపున టీవీ డిబేట్లకు హాజర య్యే వారికి ఆ పార్టీ కొత్త రూల్స్ రూపొందించింది. కేవలం బీజేపీ మీడియాసెల్ అధికారికంగా ఆమోదిం చిన వ్యక్తులు, ప్యానెలిస్టులు మాత్రమే టీవీ డిబేట్లకు హాజరుకావాలని అధికార ప్రతినిధులు ఏ మతాన్ని, మత చిహ్నాలకూ వ్యతిరేకంగాను,కించపరిచి కానీ మాట్లాడేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. అధికార ప్రతినిధులు, ప్యానెలిస్టులు పార్టీ అజెండాకు కట్టుబడి ఉండాలి తప్ప, ప్రత్యర్థుల ట్రాప్‌లో పడవద్దని ఆదేశాలు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.