సిద్దిపేట ప్రతినిధి: నడుస్తూ చెత్త ఏరుదాం అంటూ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చెయొచ్చు అంటూ మరో సంస్కరణకు సిద్ధిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువజామున పట్టణ ప్రతీ వార్డులో కలియ తిరుగుతూ ప్రజలకు చెత్తోపదేశం చేస్తున్నది. ఈ మేరకు 18వ వార్డు వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ నుంచి నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. మన చెత్త, మన బాధ్యత అంటూ పలు గృహిణీలకు చెత్త పేరుకుపోతే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, కుర్ కురే ప్యాకెట్లు, చాకలెట్ వెఫర్లు, వాటర్ గ్లాసులు, ఛాయ్ గ్లాసులు, శానిటరీ వేస్ట్ చెత్తను మంత్రి హరీశ్ రావు స్వయంగా ఎత్తి సంచిలో వేశారు.