కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మెహబూబా ముఫ్తీ. కాశ్మీర్ కు ప్రత్యేక హోదా తిరిగి తేవడం సాధ్యం కాదని ఆజాద్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని తిరిగి తేవాలంటే కాంగ్రెస్ కి పార్లమెంట్ లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, అది తన జీవితకాలంలో కాశ్మీర్ కు రాదని ఆయన ఎద్దేవా చేశారు. దీనిపై ముఫ్తీ స్పందించారు. ఇది ఆజాద్ వ్యక్తిగత అభిప్రాయం. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరించబడుతుందని దృఢంగా విశ్వసించే స్వరాలు ఉన్నాయి. అందులో నేను కూడా ఉన్నా. ఆర్టికల్ 370ని తొలగించడం సమస్యను మరింత క్లిష్టతరం చేసిందని నేను భావిస్తున్నాను. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్.. వారి దురాగతాలను అంతం చేసింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఇటువంటి అనేక స్వరాలు ఉన్నాయి. మేం ఆర్టికల్ 370ని పునరుద్ధరించడమే కాకుండా ఈ వివాదాన్ని కూడా పరిష్కరిస్తాం అని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ఆమె తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement