రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లమని.. 2023లో జరిగే ఎన్నికల్లో మేమే గెలుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ కు 90కి పైగా సీట్లు వస్తాయన్నారు. పీకే నుంచి రెగ్యులర్ గా ఫీడ్ బ్యాక్ ఉందన్నారు. కేసీఆర్ మూడుసారి సీఎం అవుతారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. సిరిసిల్ల డెవలప్ మెంట్ చూసి రాహుల్ గాంధీ నేర్చుకోవాలన్నారు. సొంత నియోజకవర్గంలోని గెలువలేని వాళ్లు.. వేరే దగ్గర గెలుస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ కొడంగల్ లో గెలవలేదు.. ఎక్కడో గెలుస్తారా ? అన్నారు. గతంలో దేశాన్ని పాలింటిన ప్రభుత్వాలు రూ.56లక్షల కోట్లు అప్పులు చేశాయన్నారు. మోడీ వచ్చాక లక్ష కోట్ల అప్పులు చేశారన్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లం.. 2023లో మేమే గెలుస్తాం..కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement