Tuesday, November 26, 2024

చ‌లో బ్రిటన్.. వారానికి నాలుగు రోజులే వ‌ర్క్ అంటా…

ప్ర‌భ‌న్యూస్ : ఇప్పటివరకు వారానికి ఐదు రోజుల పనివిధానం గురించి విన్నాం.. కరోనా వచ్చిన తరువాత వర్క్ ఫ్రమ్ హోం విధానమూ అలవాటైంది. కానీ ఇంకా మన ఆలోచనలు మారిపోవాలంటున్నారు బ్రిటన్ కు చెందిన ఓ బ్యాంక్ సీఈవో. అనడమే కాదు… వారానికి కేవలం నాలుగు రోజులు పనిచేస్తే చాలని, అదీ ఇష్టమైతే ఆఫీసుకు వచ్చి.. లేదంటే ఇంటినుంచైనా పనిచేయొచ్చంటున్నారు. జీతంలో కోతలేమీ ఉండవని భరోసా ఇస్తున్నారు.. బ్రిటన్ లో పేరుపొందిన అటోమ్ బ్యాంక్ ఒకటి. కోవిడ్ నేపథ్యంలో పనివిధానాల్లో మెరుగైన మార్పులు తీసుకురావాలంటున్న ఆ బ్యాంక్ సీఈవో మార్క్ ముల్లెన్ వారానికి నాలుగు రోజుల పనివిదానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

ఈనెల 1వ తేదీనుంచి అది అమల్లోకి వచ్చింది. ఇంతవరకు వారానికి 37.5 గంటలపాటు పనిచేసే ఉద్యోగులు ఇకముందు వారానికి కేవలం 34 గంటలు పనిచేస్తే చాలన్నమాట. ఉద్యోగులు మరింత ఉత్సాహంగా, ఆనందంగా పనిచేయడానికి ఈ నిర్ణయం పనికొస్తుందని, దానివల్ల బ్యాంకు వాణిజ్య కార్యకలాపాలు మెరుగవుతాయని, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం ఉండదని ఆయన ధీమాగా ఉన్నారు. కోవిడ్ -19 వచ్చిన తరువాత అన్ని వ్యవస్థల్లోనూ మార్పులు వచ్చాయని, వర్క్ ఫ్రమ్ హోమం విధానం ఒక్కటే సరిపోదని, తమ బ్యాంక్ అమలు చేస్తున్న సరికొత్త విధానం మునుముందు అందరూ అనుసరించక తప్పదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement