కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన 14 నెలల సుదీర్ఘ నిరసన ముగిసింది. ఢిల్లిd సరిహద్దులో ఆందోళనలు చేపట్టిన రైతులందరూ.. ఇంటి దారి పట్టారు. దీంతో ఢిల్లిd-సోనిపట్-కర్నాల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పంజాబ్, హర్యానా రైతులు అధికంగా ఉన్నారు. వారంతా తమ తమ ట్రాక్టర్లపై.. కాన్వాయ్‌గా బయలుదేరారు. ట్రక్కుల్లో వస్తువులను ఎక్కించుకుని తిరుగుముఖం అవుతున్నారు. దారివెంట ప్రయాణికులకు లడ్డూలు, బర్ఫీ, జిలేబీలు తినిపిస్తూ.. ఇంటి బాట పట్టారు. కొన్ని చోట్ల లంగర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భోజనాలు సైతం అందజేస్తున్నారు. సోనిపట్-కర్నాల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిందని సోనిపట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఘాజిపూర్ సరిహద్దు ప్రాంతంలో బయలుదేరిన ట్రాక్టర్లను రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ జెండా ఊపి ప్రారంభించారు.
రైతుల న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని భారతీయ కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు. 15వ తేదీన ఈ ప్రాంతాన్ని వీడుతానని స్పష్టం చేశారు. స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఇళ్లకు తిరుగుముఖం అయ్యారన్నారు. ఒక వేళ ప్రభుత్వం మాట మారిస్తే.. మళ్లి ఇక్కడే వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చేసిన వాగ్ధానాలను వెంటనే అమలు చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. నాలుగు రోజుల్లో ఈ ప్రాంతం అంతా ఖాళీ అవుతుందన్నారు. ఇప్పటికే చాలా మంది తమ వస్తువులను ఇళ్లకు తరలించారని, మరికొంత మంది ఉన్నారని, వీరు కూడా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital