Tuesday, November 26, 2024

దేశాల మధ్య అసమానతలు తొలిగించి కలిసికట్టుగా అంతం చేద్దాం

దేశాల మధ్య అసమానతలు తొలగించి కలిసి పని చేస్తేనే 2022లో కరోనా మహమ్మారి అంతం అవుతుందని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ సూచించారు. కరోనా రూపం మార్చుకుని విరుచుకుపడుతోందని, ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు విపరీతంగా పెరిగాయన్నారు. అమెరికా, యూకేల్లో ఈ కేసులు లక్షలాది సంఖ్యలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కరోనా నుంచి ఏ దేశం బయటపడలేదని, కొత్త చికిత్స విధానాలతో కట్టడి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దేశాల మధ్య అసమానతలు కొనసాగితే మాత్రం వైరస్‌ ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. దాని కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని అన్నారు.

ఈ ఏడాది మధ్య నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్‌ అందించే లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని దేశాలు పని చేయాలని టెడ్రోస్‌ పిలుపునిచ్చారు. దీని కోసం దేశాలన్నీ ఐకమత్యంగా పని చేయాలని సూచించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తికి దేశాలన్నీ సతమతం అవుతున్నాయని, మన దేశంతో పాటు అమెరికాలో వైరస్‌ ఉధృతి అధికంగా ఉందన్నారు. శుక్రవారం ఒకే రోజు ఏకంగా 4,43,677 మందికి వైరస్‌ సోకిందన్నారు. 716 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement