ఘట్‌కేసర్, ప్రభన్యూస్ : ఘట్‌కేసర్ మండలం అవుషాపూ ర్‌లోని మారుతినగర్ లో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. మొన్న అర్థరాత్రి సమయంలో ఇళ్ల మధ్యనున్న వీధిలైట్ కింద పులి కూర్చునట్లు కాలనీవాసులు గుర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులి సంచార విషయం కాలనీ వాసులు స్థానిక సర్పంచ్ ఏనుగు కావేరి మచ్ఛేందర్‌రెడ్డికి తెలియజేయడంతో వారు అటవీ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డికి సీసీ పుటేజ్, పులి కాలి గుర్తులు తదితర వివరాల అందజేశారు.
కాగ బీబీనగర్, సౌత్ ప్రైడ్‌హోమ్స్, మారుతీనగర్ వెంచర్లు సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఆవరించి ఉంది. పెద్ద పెద్ద చెట్లతో ప్రస్తుతం అక్కడ అడవిని తలపిస్తుంది. అక్కడ నుంచి పులి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. రాత్రి సమయంలో కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ కావేరిరెడ్డి సూచించారు.