పాములపాడు రూరల్, (ప్రభ న్యూస్): కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. దీంతో వారు భయాందోళనకు గురై ఈ విషయాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేశారు. ఎర్రగూడూరు శివారులోని తమలపాకు తోట నుంచి కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి దాటుతుండగా పాములపాడుకు చెందిన ఓ వ్యక్తికి చిరుతపులి తారసపడింది.
దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. హెడ్ కానిస్టేబుల్ ఎర్రన్న చిరుత సంచారంపై వెలుగోడు అటవీ రేంజ్ అధికారి శ్రీకాంత్ కు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ బీ వో వెంకటేశ్వర్లు, పోలీసులు పంట పొలాల్లో చిరుతపులి పాదముద్రికలను పరిశీలించారు. చిరుతపులి సంచారంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.