Friday, November 22, 2024

కడప: తెలుగు గంగ కాలువలో కొట్టుకొచ్చిన చిరుత

కడప జిల్లాలో తెలుగు గంగ కాలువలోకి చిరుతపులి కొట్టుకొచ్చింది. ఈ మేరకు కాశీనాయన మండలం బొక్కినేరు వాగు తెలుగు గంగ ఎడమ కాల్వలో చిరుత కళేబరం తేలియాడుతూ కనిపించింది. దీంతో స్థానికులు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చిరుత కళేబరం పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉందని అటవీ విభాగం అధికారులు తెలిపారు. చిరుత కళేబరాన్ని ప్రొద్దుటూరు డీఎఫ్‌వో నాగార్జునరెడ్డి, అటవీ రేంజర్ మధుబాబు, విశ్రాంత రేంజర్ తిరుమలేష్ రాజు పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: చంద్రబాబును కలిసి మురిసిపోయిన 97 ఏళ్ల వృద్ధుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement