కాన్పూర్‌లో ఇవ్వాల ఉదయం ఓ చిరుతపులి డెడ్‌బాడీ కనిపించింది. కాన్పూర్‌లోని న్యూ చౌక్ ప్రతాపూర్ గ్రామంలోని పొలాల్లో హైవే వెంబడి చిరుత మృతదేహం కనిపించిందని, స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత డెడ్‌బాడీని పరిశీలించారు. చిరుత మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.
నాలుగు-ఐదేళ్ల మగ చిరుతపులి మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం పంపాం.. ఇది వాహనం ఢీకొనడంతో తలకు గాయం కారణంగా చనిపోయిందని భావిస్తున్నాం అని కాన్పూర్ జిల్లా అటవీ అధికారి (DFO) తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలం పక్కనే ఉన్న హైవేపై చిరుతపులిని వాహనం ఢీకొట్టింది. తలకు గాయం అయిన తరువాత చనిపోవడానికి ముందు పొలాల్లోకి కాసేపు నడిచి ఉండవచ్చు అని అధికారులు తెలిపారు.