Thursday, November 21, 2024

సినీ పరిశ్రమలో విషాదం… లెజెండరీ డైరెక్టర్ కన్నుమూత‌

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ అనారోగ్యం కార‌ణంగా కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సేతు మాధవన్… చికిత్స తీసుకుంటూ చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

కేరళలోని పాలక్కడ్‌లో 1931లో సేతు మాధ‌వ‌న్ జ‌న్మించారు. 1961లో మలయాళ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఆయ‌న సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. తెలగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో క‌లిపి ఆయ‌న మొత్తం 60కిపైగా సినిమాల‌ను రూపొందించారు. 1991లో మరుపక్కమ్‌ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఆయ‌న‌కు అవార్డు ద‌క్కింది. మలయాళంలో “ఒడాయిల్ నిన్ను”, “అనుభవంగళ్ పలిచకల్”, “ఒప్పోల్”, “అరనాజికనీరం”, “అచనుం బప్పాయుమ్” వంటి ఎవర్ గ్రీన్ సినిమాలను సేతుమాధవన్ దర్శకత్వం వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement