ప్రత్యక్షంగాని, పరోక్షంగాని ఆకతాయిలతో లైంగిక వేధింపులకు గురౌవుతున్న అమ్మాయిలు, మహిళలు ఇకనైనా మౌనం వీడి నిర్భయంగా షీ టీమ్స్క ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ మహిళలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీమ్స్ పనితీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ ఉమెన్ సేఫ్టీ విభాగం అధ్వర్యంలో పనిచేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీమ్స్ యువతులు, మహిళల రక్షణకై నిరంతరం శ్రమిస్తున్నారని. ముఖ్యంగా ఆన్లైన్, ఆన్లైన్ ఎక్కడైనా ఎప్పుడైనా అమ్మాయిలు, మహిళలను వేధించే ఆకతాయిల పట్ల వరంగల్ షీ టీమ్స్ పోలీసులు కఠిన వ్యవహరిస్తునే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని. షీ టీమ్స్ పనితీరుపై మహిళలకు మరింత నమ్మకం పెరగడంతో ఆకతాయిలపై మహిళలు, యువతులు చేస్తున్న ఫిర్యాదుల సంఖ్య ఘననీయంగా పెరిగిందన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, ఇన్స్‌స్పెక్టర్ నేతృత్వంలో ఒక మహిళతో సహ ముగ్గురు ఎస్.ఐలు, ఒక ఎ.ఎస్.ఐ, నలుగురు హెడ్ కానిస్టేబుళ్ళు, 5 కానిస్టేబుళ్ళ, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళతో పాటు ఒక మహిళా హోంగార్డు పనిచేస్తాన్నారు. ఇకపై ఎవరైన ప్రత్యక్షంగాని, పరోక్షంగాని లేక సామాజిక మాద్యమాల్లో ద్వారాని మహిళలు, యువతులు లైంగిక వేధింపులకు గురైయ్యే తక్షణమే షీ టీమ్స్ నంబర్లు 8712685142, 8712685270 లేదా డయల్ 100 ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.