వీసా నిబంధనల ఉల్లంఘన, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 726 మంది చైనా జాతీయులు ప్రతికూల జాబితాలో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రకటించారు. 81 మంది చైనీయులకు ఇండియా నుంచి వెళ్లి పోవాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగిందని, మరో 117 మందిని 2019 నుంచి 2021 మధ్య వీసా నిబంధనలు ఉల్లంఘించడం. ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై వెనక్కు పంపడం జరిగిందని ఆయన సభలో ప్రకటించారు. సరైన ప్రయాణ డాక్యుమెంట్లతో ఇండియాలోకి ప్రవేశించిన విదేశీ పౌరుల రికార్డులను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తుందని, ఆ జాబితాలో చైనా పౌరులు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు.
కొంతమంది విదేశీయులు వారి వీసా గడువు ముగిసినా, ఇండియాలోనే ఉంటారని, అనారోగ్యం, అత్యవసర వైద్య చికిత్స లేదా ఇతర వ్యక్తిగత కారణాలను పరిశీలించిన మీదట, జరిమానా విధించి ప్రభుత్వం వీసా గడువు పొడిగిస్తుందని మంత్రి వెల్లడించారు. అయితే, సహేతుకమైన కారణాలు లేకుండా వీసా గడువు ముగిసినా, ఇండియాలో వి దేశీయులపై ఫారినర్స్ యాక్ట్ 1946 కింద దేశం విడిచి వెళ్లమని లీవ్ ఇండియా నోటీస్ జారీ చేయడంతో పాటు జరిమానా, వీసా ఫీజు వసూలు చేస్తుందని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.