Saturday, November 23, 2024

కంటోన్మెంట్ ప్రాంతాల లీజు మార్గదర్శకాలను సమీక్షించాలి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్ ప్రాంతాల లీజు ప్రాతిపదికకు సంబంధించి ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సమీక్షించవలసిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రక్షణ భూములకు సంబంధించిన అన్ని కంటోన్మెంట్ ప్రాంతాల లీజు అంశాన్ని ఆయన మంగళవారం లోక్‌స‌భ‌లో 377 నిబంధ‌న కింద ప్ర‌త్యేకంగా‌ ప్ర‌స్తావించారు. సికింద్రాబాద్‌తో సహా కంటోన్మెంట్ భూములు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చాలా సంవత్సరాలు ప్రజా ప్రయోజనాల కోసం లీజుకు ఇస్తున్నట్టు ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

కానీ ఆ భూములను ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండా వాణిజ్య భవనాలు ఆక్రమించాయని ఆయన వివరించారు. అనధికార నిర్వాసితులకు కంటోన్మెంట్ బోర్డుల ఖర్చుతో అన్ని పౌర సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోతోందని అన్నారు. ఈ వ్యవహారంలో రక్షణ శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని ఎంపీ కోరారు. దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని లీజు అద్దె ఒప్పందాలను సమీక్షించాలని, అటువంటి భూములను రాష్ట్రాలకు విధానపరమైన చర్యగా అప్పగించాలని ప్రభాకర్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement