Thursday, September 19, 2024

నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలి – పివిపికి హైపర్ ఆది వార్నింగ్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు అలాగే సినీ ప్రముఖులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఫేస్ టు ఫేస్ ఏమి అనలేకపోయినా ట్విట్టర్ లో మాత్రం ట్వీట్ లు పెడుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత పీవీపీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఓ వీడియోను పివిపి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ముంబై రైల్వే స్టేషన్ లో రైలు కింద పడబోతున్న పాపను ప్రాణాలకు తెగించి రైల్వే పోలీస్ కాపాడాడు. ఆ వీడియోని షేర్ చేస్తూ రియల్ హీరో బాబు… రీల్ హీరో కాదు. లంగా డాన్స్ వేసే సార్లకు 50 కోట్లు. ఈ రియల్ హీరో కి జస్ట్ జావా బైక్. హత విధి.. మనం చేసే కొంచమైనా, కొట్టే సిటిమార్ లైన ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్ అంటూ ట్వీట్ చేశాడు.

కాగా ఈ ట్వీట్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అందులో ఒకరైన హైపర్ ఆది పివిపికి కౌంటర్ ఇచ్చారు. నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్న కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి సాయం చెయ్యరు.. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే.. సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళనగా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలని అనుకుంటున్నారు జనాలు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement