హైదరాబాద్, ఏప్రిల్ 29 (ప్రభ న్యూస్) : ప్రతి భారతీయ మహిళకు రుతుక్రమ ఆరోగ్య సహచరిగా మారడం కోసం ప్రముఖ ఫెమ్-టె-క్ బ్రాండ్ నువా, శానిటరీ ప్యాడ్స్, క్రాంప్ కంఫర్ట్, ఇంటిమేట్ వాష్, ప్యాంటీ లైనర్స్ వంటి మెన్‌స్ట్రువ్రల్ వెల్‌నెస్ ఉత్పత్తుల కోసం టైమ్ 100 గౌరవనీయురాలు, నటి దీపికా పదుకొణేని బ్రాండ్‌ఫేస్‌గా ప్రకటించింది. ఈ సహకారంపై సీఈవో, వ్యవస్థాపకుడు రవి రామచంద్రన్ .. తమ బ్రాండ్ లక్ష్యంతో మన దేశంలోని మహిళల పట్ల వారి విజన్ పరిపూర్ణంగా ఉన్న శక్తివంత మైన మహిళ దీపికా పదుకొణతో భాగస్వామ్యం చేసుకున్నందుకుతాము చాలా సంతోషిస్తున్నామన్నారు.
కట్టుబాట్లను దాటి తీసుకునే సాహసోపేతమైన ప్రయత్నాలు, ఆశావాదంతో ఆమె బ్రాండ్ నువా కోసం సరైన ఎంపికగా భావిస్తున్నామన్నారు. తాము సైన్స్ ఆధారిత ఉత్పత్తులను రూపొందించడాన్ని కొనసాగిస్తున్నందున, భారతీయ మహిళలకు రుతుక్రమ ఉత్పత్తులకు సులభంగా ప్రాప్యతను అందిస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..