Monday, November 25, 2024

ప్రముఖ ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ ఎంటీఎఆర్‌ టెక్నాలజీస్‌లో 50శాతం వృద్ధి : శ్రీనివాసరెడ్డి

ఎంటీఎఆర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ డిసెంబర్‌ 31, 2021తో ముగిసిన మూడవ త్రైమాసికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రముఖ ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఎంటీఎఆర్‌.. అణు, అంతరిక్షం, రక్షణ రంగాలకు ఉపయోగపడే మిషన్‌ కాంపొనెంట్‌ల తయారీలో పేరుగాంచింది. త్రైమాసిక ఫలితాలపై ఎంటీఎఆర్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ ప్రమోటర్‌ పర్వత శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..ఎంటీఎఆర్‌ ఆదాయం 41.4శాతం వృద్ధితో 78.1కోట్లు పెరిగిందన్నారు. నికరలాభం 50.5శాతం వార్షిక వృద్ధితో 13.3కోట్లు నమోదైందని, సివిల్‌ న్యూక్లియర్‌ పవర్‌, స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ రంగాల నుంచి దేశీయ ఆర్డర్‌ ఇన్‌ఫ్లో రాబోయే త్రైమాసికాల్లో మరింత వేగవంతం అవుతాయని భావిస్తున్నామన్నారు.

కేంద్ర బడ్జెట్‌ 2022 ఆత్మనిర్భర్‌ భారత్‌ చొరవ, స్వదేశీకరణను ప్రొత్సహించడంతో భారతీయ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంటీఎఆర్‌ టెక్నాలజీస్‌ సివిల్‌ న్యూక్లియర్‌ పవర్‌, స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, ఎనర్జీ రంగాలకు సేవలందిస్తుంది. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ది ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో), డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) తదితర ప్రముఖ భారతీయ సంస్థలతో తమ కంపెనీ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement