Saturday, November 23, 2024

ప్రముఖ నటి ఒక్సానా మృతి.. ఫేస్​బుక్​ ద్వారా వెల్లడి

రష్యా క్షిపణులు, రాకెట్ల దాడుల్లో వందలాది మంది ఉక్రెయిన్‌ పౌరులు చనిపోతున్నారు. తాజాగా రష్యా ప్రయోగించిన రాకెట్‌ దాడిలో ఉక్రెయిన్‌ ప్రముఖ రంగస్థల సినీ నటి ఒక్సాన్‌ ష్వెట్స్‌ మరణించారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని నివాస భవనాలపై రష్యా బలగాలు రాకెట్లతో దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో 67 ఏళ్ల ఒక్సానా మృతి చెందారు. ఈ మేరకు యంగ్‌ థియేటర్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడైంది. ఒక్సానా 1955లో జన్మించారు.

ఆమెకు ఉక్రెయిన్‌ అత్యున్నత కళాత్మక గౌరవాలతో బిరుదు లభించింది. ఈ బిరుదును గౌరవనీయ కళాకారిణి ఆఫ్‌ ఉక్రెయిన్‌గా పిలుస్తారు. ఈమె ఇవాన్‌ ఫ్రాంకో థియేటర్‌, కీవ్‌ స్టేట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆర్ట్‌ ్సలో విద్యనభ్యసించారు. ఉక్రెయిన్‌లో దీర్ఘ కాలంగా థియేటర్‌ ఆర్టిస్టుగా పని చేశారు. ఒక థియేటర్‌ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా.. పలు సినిమాల్లోనూ ఆమె నటించారు. టుమారో విల్‌ బీ టుమారో, ది సీక్రెట్‌ ఆఫ్‌ సెయింట్‌ పాట్రిక్‌, ది రిటర్న్‌ ఆఫ్‌ ముఖ్తార్‌ అనే మూవీలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement