Saturday, November 23, 2024

వందేళ్ళ క్రితం నాటి భ‌వ‌నంలా రెస్టారెంట్.. ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు..

పాత వ‌స్తువ‌ల‌న్నా..పాత భ‌వ‌నాలను చూడ‌టానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు నేటి యువ‌త‌. వాటి హిస్ట‌రీ గురించి తెలుసుకునేందుకు ఉత్సాహ‌న్ని చూపిస్తుంటారు చాలామంది. అందుకే వినూత్నంగా ఆలోచించాడో క్రియేట‌ర్..పాత వాటికి ఉన్న డిమాండ్ తెలుసుకుని త‌న రెస్టారెంట్ ని పాత‌భ‌వంనా నిర్మించాడు. ఈ రెస్టారెంట్ ఎక్క‌డ ఉందో తెలుసా..రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉంది. దీని పేరు లే కరేజ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ కి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్ లోపల అంతా 19వ శతాబ్దపు వాల్‌పేపర్లే ఉంటాయి. ఆధునికత అన్నదే ఉండదు. దాంతో ఈ రెస్టారెంట్ కి జ‌నం త‌ర‌లివెళ్తున్నార‌ట‌. మొత్తానికి ఒక ఐడియాతో బిజినెస్ ని పెంచుకునే మార్గాన్ని క‌నిపెట్టారు రెస్టారెంట్ నిర్వాహ‌కులు.

ఈ రెస్టారెంట్ లోకి అడుగుపెట్ట‌గానే గ‌తంలోకి వెళ్లిన‌ట్టు ఉంటుంది. అంతేకాదు ఈ రెస్టారెంట్ వందేళ్ళ క్రితం నాటి భ‌వ‌నంలా క‌నిపిస్తుంది..రేపో మాపో కూలిపోయే భ్ర‌మ‌ని క‌లిగిస్తుంద‌ట‌. దీనికి కార‌ణం ప్రత్యేకమైన ఇంటీరియర్.చాలా విచిత్రంగా కనిపించే ఈ రెస్టారెంట్‌ని 19వ శతాబ్దపు భవనంలా రూపొందించ‌డం విశేషం. కావాలనే ఈ రెస్టారెంట్ గోడలు తడిగా, వర్షానికి నానిపోయి ఉబ్బినట్లు కనిపిస్తాయి. చాలా చోట్ల పెచ్చులు ఊడిపోవడం, సుత్తితో పగలగొట్టినట్లుగా డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఉంచిన ఫర్నిచర్ కూడా నేటి కాలానికి చెందినది కాదు, పురాతనమైనది. గదుల పైకప్పులు కూడా పడిపోబోతున్నాయి అనిపించే విధంగా డిజైన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement