Monday, November 18, 2024

Layoffs | ప్రముఖ మ్యూజిక్‌ యాప్ స్పోటిఫైలో తొలగింపులు

ఆర్ధిక మాందం పేరుతో టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించే విషయంలో పోటీ పడుతున్నాయి. తాజాగా టెక్‌ కంపెనీల బాటాలోనే ప్రముఖ మ్యూజిక్‌ సర్వీస్‌ స్పోటిఫై కూడా చేరింది. ఈ వారంలో కొంత మంది ఉద్యోగులను తొలగిందుకు నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్లో స్పోటిఫై తన గిమ్‌లెట్‌ మీడియా అండ్‌ పాడ్‌కాస్ట్‌ స్టూడియోస్‌ నుంచి 38 మందిని తొలగించింది. సెప్టెంబర్‌లో ముగిసిన త్రైమాసికం నాటికి స్పోటిఫైలో 9,800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
కరోనా సమయంలో టెక్‌ ఆధారిత సేవలకు డిమాండ్‌ పెరగడంతో చాలా కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి.

ఇప్పుడు పరిస్థితు మారిపోయాయి. టెక్‌ కంపెనీలకు డిమాండ్‌ తగ్గింది. ఆదాయాలు పడిపోయాయి. దీంతో చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగింస్తున్నాయి. 2019లో పాడ్‌ కాస్టింగ్‌పై స్పోటిఫై పెద్ద ఎత్తున ప్రణాళికలు ప్రకటించింది. పాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌లు, క్రియేషన్‌ సాఫ్ట్‌వేర్‌, సర్వీసుల హోస్టింగ్‌ జో రోగన్‌ ఎక్స్‌పీరియెన్స్‌, ఆర్మ్‌చైర్‌ ఎక్స్‌పర్ట్‌ వంటి ప్రఖ్యాత షోల ప్రసార హక్కుల కోసం ఈ కంపెనీ 1 బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. వాటాదారులకు మాత్రం ఎలాంటి లాభాలు చూపించలేకపోయింది.

సమీప భవిష్యత్‌లోనూ కంపెనీ లాభాల్లోకి వచ్చే సూచనలు లేవని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది కంపెనీ షేర్‌ 66 శాతం పతనమైంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ లాభాల్లోకి వస్తుందని గత జూన్‌లో కంపెనీ ప్రకటించింది. ఈ దిశగా పురోగతి మాత్రం కనిపించలేదు. వ్యయాలను నియంత్రించాలని భావిస్తున్న కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఎంత మందిని తొలగించేది కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement