Saturday, October 5, 2024

Delhi | రేషన్ కార్డుల జారీలో అలసత్వం… సుప్రీం సీరియస్ !

వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేసే అంశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇదే చివరి అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

లేని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ వ్యవహారంపై నవంబరు 19వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement