Tuesday, November 26, 2024

అర‌గంట‌లో అద్భుత ప్ర‌యోగం – ఇస్రో అద్వితీయ ఘ‌న‌త (వీడియోతో)

చిత్రదుర్గ, కర్నాటక: అంతరిక్ష ప్రపంచంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్వితీయమైన ఘనతను సాధించింది. కర్నాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌) వద్ద పునర్వినియోగ లాంచ్‌ వెహికల్‌ స్వతంత్రంగా భూమి పైకి చేరుకునే మిషన్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ”భారత్‌ సాధించింది. ఉదయం 7.10 గంటలకు పునర్వినియోగ లాంచ్‌ వెహికల్‌ స్వతంత్ర లాంచింగ్‌ మిషన్‌ (ఆర్‌ఎల్‌వీ ఎల్‌యీఎక్స్‌) ను డీఆర్‌డీవోతో కలిసి ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో తొలిసారి అన్నట్టుగా ఒక లాంచ్‌ వెహికల్‌ను ఒక హెలికాప్టర్‌ భూమి నుంచి గగనతలంలో 4.5 కి.మీ.ల ఎత్తుకు చేర్చింది. ఆ తర్వాత సదరు లాంచ్‌ వెహికల్‌ తనంతటతానుగా ఒక రన్‌వే మీదకు దిగేలా దానిని హెలికాప్టర్‌ జారవిడిచింది.

ఇస్రో ప్రకటన ప్రకారం భారతీయ వైమానిక దళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ ఉదయం 7.10 గంటలకు ఆర్‌ఎల్‌వీని గగనతలంలోకి తీసుకొని వెళ్ళింది. ఆర్‌ఎల్‌వీకి చెందిన మిషన్‌ మేనేజ్‌మేంట్‌ కంప్యూటర్‌ కమాండ్‌ ప్రాతిపదికగా ముందుగా నిర్దేశించిన పిల్‌బాక్స్‌ ప్రమాణాలకు చేరుకున్న వెంటనే గగనతలంలోని ఆర్‌ఎల్‌వీ 4.6 కి.మీ.ల దిగువ రేంజ్‌కు విడుదల చేయబడింది. ఆర్‌ఎల్‌వీ భూమిపైకి విడుదల చేసే ప్రక్రియలో లాంచ్‌ వెహికల్‌ స్థితి, గతివేగము, ఎత్తు (ఆల్టిట్యూడ్‌), ఆర్‌ఎల్‌వీ ఆకృతి రీతులు, తదితర 10 ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఆర్‌ఎల్‌వీ భూమి మీదకు చేరుకునే ప్రక్రియ స్వతంత్రంగా జరిగింది. ఆ క్రమంలో సమీకృత నావిగేషన్‌, మార్గదర్శనం మరియు నియంత్రణ వ్యవస్థలను వినియోగించుకొని భూమిపై నిర్దేశిత రన్‌వేపై దిగడానికి ఉపకరించే అంశాలు ఊతంగా చేసుకొని ఆర్‌ఎల్‌వీ ఉదయం 7.40 గంటలకు స్వతంత్రంగా ఏటీఆర్‌ వద్ద భూమిపైకి దిగింది. తద్వారా, ఒక అంతరిక్ష వాహనం తనంతటతానుగా భూమి మీదకు చేరుకునే ఘనతను ఇస్రో సాధించింది. కచ్చితత్వంతో కూడుకున్న నావిగేషన్‌ హార్డ్‌ వేర్‌, సాఫ్ట్‌వేర్‌, సూడోలైట్‌ వ్యవస్థ, కేఏ-బ్యాండ్‌ రాడార్‌ అల్టిమీటర్‌, ఎన్‌ఏవీఐసీ రిసీవర్‌, కిందకు దిగడానికి ఉపకరించే దేశవాళీ గేర్‌, ఏరోఫిల్‌ హనీ కూంబ్‌ రెక్కలు, బ్రేక్‌ పేరాచూట్‌ సిస్టమ్‌ లాంటి పలు అధునాతన సాంకేతికతలను ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌ వినియోగించుకుందని ఇస్రో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement