Tuesday, November 26, 2024

భద్రాచలం రోడ్‌ సత్తుపల్లి కొత్త రైల్వే లైన్‌ సెక్షన్‌లో మొదటి గూడ్స్‌ రైలు ప్రారంభం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భద్రాచలం రోడ్‌ సత్తుపల్లి రైల్వే లైన్‌లో తొలి డూడ్స్‌ రైలు శనివారం ప్రారంభమైంది. సత్తుపల్లి నుండి బొగ్గు లోడ్‌ కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు రవాణా అయింది. భద్రాచలం – సత్తుపల్లి నూతన రైల్వే లైను ప్రాజెక్టు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్న ప్రాజెక్టులలో ఒకటి. భద్రాచలం-సత్తుపల్లి నూతన రైలును 2010-11లో మంజూరైంది. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం సుమారు రూ. 927.94 కోట్లు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి రూ. 618.55 కోట్ల భాగస్వామ్యం ఉందని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు.
ఈ ప్రాజెక్టు రైల్వేతో పాటు ఎస్‌సీసీఎల్‌ రెండింటికి ప్రయోజనకరమైనదన్నారు. సత్తుపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని బొగ్గు గనుల నుంచి పర్యావరణ అనుకూల, వేగవంతంగా బొగ్గు రవాణాకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల బొగ్గు డిమాండ్‌ను నెరవేరుస్తుందన్నారు. రైల్వేలకు అదనపు లోడింగ్‌, ఆదాయాన్ని కూడా కలిగిస్తుందని తెలిపారు. ఇది వరకు రవాణా కోసం ఈ ప్రాంతానికి రైలు అనుసంధానాన్ని కల్పిస్తుందన్నారు. రోడ్డు రవాణా తగ్గడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement