హాంకాంగ్ లోని పర్యాటక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది హాంకాంగ్ ప్రభుత్వం. “హలో హాంకాంగ్” అనే ఒక ప్రపంచ పర్యాటక ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా హాఫ్ మిలియన్ (500,000) హాంకాంగ్ విమాన టిక్కెట్‌లు ప్రయాణీకులకు ఫ్రీగా పంచేందుకు అందుబాటులో ఉంచింది. కొవిడ్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం.. మరింత మంది అంతర్జాతీయ ప్రయాణికులను నగరానికి ఆకర్షించడం ఈ పర్యాటక ప్రచార లక్ష్యం. ఇటీవలి నెలల్లో కోవిడ్ ఐసోలేషన్ రూల్స్ తో పాటు ప్రయాణ పరిమితులను ఉపసంహరించుకుంది హాంకాంగ్ ప్రభుత్వం.
ఇక ఈ పర్యాటక ప్రచారంపై ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుంది. అంతే కాకుండా, €250 మిలియన్ కంటే ఎక్కువ విలువైన 500,000 ఎయిర్‌లైన్ టిక్కెట్‌లను విమానయాన సంస్థలు దశలవారీగా పంపిణీ చేయనున్నాయి. అయితే, పర్యాటకులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఈ ‘హలో హాంకాంగ్’ ప్రీ టికెట్ల పంపిణీ మార్చి 1న ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. కొన్ని విమాన టిక్కెట్లు హాంకాంగ్ నివాసితులకు కూడా రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఎక్కువ మంది పర్యాటకులు నగరానికి వచ్చే వీలున్నందున.. కొన్ని కొత్త టూరిస్ట్ ప్లేస్ లను హైలైట్ చేయాలని చూస్తోంది హాంకాంగ్ ప్రభుత్వం.
అందులో Hong Kong Palace Museum, brand-new Peak Tram and Ngong Ping 360 cable cars, Ocean Parkతో పాటు ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు మరెన్నో టూరిస్ట్ ప్లేస్ లు ఉన్నాయి. అంతే కాకుంగా హాంకాంగ్ స్థితిని తిరిగి తీసుకురావడానికి, సిటీలో రాబోయే కొన్ని నెలల్లో 200 కంటే ఎక్కువ ఈవెంట్‌లు జరగబోతున్నాయి. వీటిలో రగ్బీ సెవెన్స్ టోర్నమెంట్ వంటి క్రీడా కార్యక్రమాలు, ఆర్ట్ బాసెల్ వంటి కళలు, సంస్కృతి ఉత్సవాలు జరగనున్నట్టు హాంకాంగ్ తెలిపింది.