Friday, November 22, 2024

గోద్రేజ్‌ క్యాపిటల్‌ ప్రారంభం, గోద్రేజ్‌ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌కు అనుసంధానం

గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ ఓ కీలక ప్రకటన చేసింది. ఆర్థికపరమైన సేవల కోసం గోద్రేజ్‌ క్యాపిటల్‌ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్టు వివరించింది. సొంతంగా సేవలు అందించేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. గోద్రేజ్‌ క్యాపిటల్‌ అనే సంస్థ.. గోద్రేజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌కు అనుబంధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా గోద్రేజ్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మనీష్‌ షా మాట్లాడుతూ.. ఇప్పటికే గోద్రేజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌తో ఇంటికి రుణాలు అందజేస్తున్నామన్నారు. ఆర్థిక సేవల రంగంలో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది. 2026 నాటికి ఈ వ్యాపారానికే మొత్తం రూ.5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

2026 నాటికి రూ.30,000 కోట్ల బ్యాలెన్స్‌ షీట్‌తో రిటైల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యాపారాన్ని నిర్మించాలని గోద్రేజ్‌ గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుతం ముంబై, బెంగళూరు, ఢిల్లి ఎన్‌సీఆర్‌, అహ్మదాబాద్‌, పుణే నగరాల్లో గోద్రేజ్‌ క్యాపిటల్‌ విస్తరించి ఉంది. త్వరలోనే జైపూర్‌, చండీగడ్‌, హైదరాబాద్‌, చెన్నై, ఇండోర్‌, సూరత్‌ వంటి ఆరు కొత్త నగరాల్లో కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గోద్రేజ్‌ గ్రూప్‌లో గోద్రేజ్‌ క్యాపిటల్‌ కీలకంగా మారనుందని గోద్రేజ్‌ గ్రూప్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ పిరోజ్నా గోద్రెజ్‌ తెలిపారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement