బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గత ఏడాది(2022)లో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల్లో “బ్రహ్మాస్త్ర” ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రా పార్ట్ 1: శివ భారీ విజయం సాదించింది. ఇక ఈ సినిమా నుంచి మరో 2 పార్ట్ లు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. కాగా, బ్రహ్మాస్త్ర సీక్వెల్ పార్ట్ 2, 3 పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని దర్శకుడు అయాన్ ముఖర్జీ నిర్మించగా.. ఈ సినిమా నుంచి వచ్చే తదుపరి రెండు సినిమాలను గ్రాండ్‌గా తీసుకువస్తానని ప్రేక్షకులకి హామీ ఇచ్చారు.
స్టార్ స్టూడియోస్ ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, అయాన్ ముఖర్జీ నిర్మించిన బ్రహ్మాస్త్ర మొదటి భాగం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. చిత్రనిర్మాతలు ఈ సినిమాలను పూర్తి చేయడానికి తనకు మరింత సమయం పడుతుందని చెబుతున్నారు. బ్రహ్మాస్త్ర 2,3 రిలీజ్ ఆలస్యం కానుందని వెల్లడించారు.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో డైరెక్టర్ అయాన్ ఒక పోస్ట్ వేసాడు. బ్రహ్మాస్త్రా పార్ట్ 2,3 రెండు సినమాలను ఒకే సారి నిర్మించబోతున్నట్లు వెల్లడించాడు అయాన్. బ్రహ్మాస్త్రా 2, 3 కి సంబంధించి స్క్రిప్ట్‌ని పూర్తి చేయడానికి మరింత సమయం కావాలని వెల్లడించాడు. పార్ట్ వన్ పై వచ్చిన ఫీడ్ బ్యాక్ లని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2,3 ని మరింత గ్రాండ్ గా రూపొందిస్తానని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు అయాన్. ముందుగా బ్రహ్మాస్త్రా పార్ట్ 2, 2025 దీపావళికి విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు బ్రహ్మాస్త్రా పార్ట్ 2 2026 డిసెంబర్ లో, బ్రహ్మాస్త్ర పార్ట్ 3 2027 డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.