దేశ వ్యాప్తంగా ఐపీఎల్ సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జియో సరికొత్త రీఛార్జీలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఆదివారం ఓ నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. రూ.555తో రీచార్జీ చేసుకుంటే.. 55 రోజుల కాలపరిమితి అందించనుంది. ఈ ప్లాన్ పొందిన వారికి 55 జీబీ డేటా కూడా అందనుంది. ఏడాది పాటు డిస్నీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అన్ని జియో యాప్‌ల సబ్ స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు. అయితే ఇందులో వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సదుపాయం మాత్రం ఉండబోదని వివరించింది. అదేవిధంగా 365రోజుల సరికొత్త ప్లాన్‌ను కూడా ప్రకటించింది. దీని కోసం సదరు యూజర్ రూ.2,999తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్‌కు రోజుకు 2.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. దీనికి తోడు డిస్నీ, హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉంటుంది.
ఇవీ జియో ప్లాన్లు..
ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల ప్లాన్‌లను జియో తీసుకొచ్చింది. రూ.499 రీచార్జితో 28 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, రూ.610 రీచార్జితో 28 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా అందనుంది. రూ.799 రీచార్జితో 56 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, రూ.1,066 రీచార్జీతో 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, రూ.1,499 రీచార్జితో 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, రూ.3,199 రీచార్జితో 365 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా అందనుంది. రూ.4,199 రీచార్జితో 365 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా ఇవ్వనున్నారు. డేటా యాడ్ ఆన్ కేటగిరిలో రూ.659 రీచార్జితో 58 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా అందుతుంది. ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకుని సరికొత్త ప్లాన్‌లను తీసుకొచ్చినట్టు జియో వివరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...