ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,263 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 454, గుంటూరు జిల్లాలో 418, కృష్ణా జిల్లాలో 318, శ్రీకాకుళం జిల్లాలో 280, కడప జిల్లాలో 259, నెల్లూరు జిల్లాలో 245, కర్నూలు జిల్లాలో 176, తూ.గో. జిల్లాలో 134, అనంతపురం జిల్లాలో 116, ప్రకాశం జిల్లాలో 107, విజయనగరం జిల్లాలో 83, ప.గో. జిల్లాలో 19 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 1,091 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, కడప జిల్లా, కర్నూలు, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,28,664 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,98,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 23,115గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,311గా ఉంది.
తగ్గేదే లే.. ఏపీలో కోరలు చాస్తున్న కరోనా
By ramesh nalam
- Tags
- andhra pradesh
- breaking news telugu
- CORONA VIRUS
- COVID VACCINATION
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- positive cases
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu trending news
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement