Tuesday, November 19, 2024

ఏపీలో మరోసారి భారీగా కరోనా కేసులు

ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 176 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 170, చిత్తూరు జిల్లాలో 163, కృష్ణా జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 89, కర్నూలు జిల్లాలో 54, తూ.గో. జిల్లాలో 49, అనంతపురం జిల్లాలో 46, శ్రీకాకుళం జిల్లాలో 42, కడప జిల్లాలో 31, ప్రకాశం జిల్లాలో 27, విజయనగరం జిల్లాలో 15, ప.గో. జిల్లాలో 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 306 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,96,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,515 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 4,145గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,203గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement