ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,558 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 465 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 399, కర్నూలు జిల్లాలో 344, విశాఖ జిల్లాలో 290, నెల్లూరు జిల్లాలో 204, శ్రీకాకుళం జిల్లాలో 185, ప్రకాశం జిల్లాలో 153, కృష్ణా జిల్లాలో 152, అనంతపురం జిల్లాలో 131, కడప జిల్లాలో 94, తూ.గో. జిల్లాలో 58, విజయనగరం జిల్లాలో 46, ప.గో. జిల్లాలో 37 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 915 మంది కరోనా నుంచి కోలుకోగా గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,15,832 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,93,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 14,913గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,268గా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement