Sunday, November 17, 2024

Last Rites – నేటి మ‌ధ్యాహ్నం రామ్మూర్తినాయుడి అంతిమ సంస్కారాలు

నారావారిప‌ల్లె – నిన్న మ‌ర‌ణించిన చంద్ర‌బాబు సోద‌రుడు నారా రామ్మూర్తినాయుడి అంతిమ సంస్కారాలు నేడు ఆయ‌న స్వ‌గ్రామ‌మైన నారావారిప‌ల్లెలో నేటి మ‌ధ్యాహ్యం నిర్వ‌హించ‌నున్నారు.. దీనిలో భాగంగా హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని రేణిగుంట‌కు చేర్చారు. అక్క‌డి నుంచి నారావారిపల్లెకు తరలించారు. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి తీసుకొచ్చారు.

కాగా, తన తమ్ముడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా చంద్రబాబుతో పాటు వచ్చారు.

చివ‌రి ద‌ర్శ‌నం కోసం

నారావారిప‌ల్లెలో మ్మూర్తి పార్థివదేహాన్ని ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో ఆయ‌న‌కు అభిమానులు, టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్తులు , ప‌లువురు ప్ర‌ముఖులు క‌డ‌సారి ద‌ర్శ‌నం చేసుకుని అంజ‌లి ఘ‌టిస్తున్నారు. ఇక కాసేపట్లో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు నారావారిపల్లెకు తరలివచ్చారు. తమ తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement